పుంజుకున్న రూపాయి విలువ.. డాలర్తో పోలిస్తే 33 పైసలు లాభం!
రూపాయి విలువ పెరిగింది
Indian rupee


ముంబై, 06 ఏప్రిల్ (హి.స.)

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న

ఉద్రిక్తతలు (West Asia War), అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం వంటి కారణాలు రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వచ్చిన భారత రూపాయి విలువ నేడు ట్రేడింగ్ ప్రారంభంలో అనూహ్యంగా పుంజుకుంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 33 పైసలు పెరిగి 92.85 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్లో రూపాయి విలువ రూ. 93.18 వద్ద ముగియగా, నేడు సానుకూల వాతావరణం మధ్య రూ.92.85 వద్ద ప్రారంభమైంది.

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు స్వల్పంగా రావడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ (Dollar Index) కొంత బలహీనపడటం రూపాయికి కలిసి వచ్చింది. అలాగే ఆసియా కరెన్సీల బలోపేతం, ముడి చమురు ధరల్లో స్వల్ప స్థిరత్వం కూడా రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande