నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!..
వారాంతపు సెలవుల తర్వాత నేడు ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి
Stock market


ముంబై, 06 ఏప్రిల్ (హి.స.)

వారాంతపు సెలవుల తర్వాత నేడు ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు (Stock markets) భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 27013 పాయింట్లు క్షీణించి 73,049.42 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా సుమారు 93 .60 పాయింట్లు నష్టపోయి 22,619.50 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.

మార్కెట్లో భయాందోళనలను సూచించే 'ఇండియా VIX' దాదాపు 2.7% పెరిగి 26.23 స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు ఉన్నాయని సూచిస్తుంది. తాజా పరిణామాలతో ముఖ్యంగా ఆయిల్ & గ్యాస్, హెల్త్కేర్, ఫార్మా రంగాలు నష్టాల్లో ఉండగా.. ఐటీ, మెటల్ రంగాలు స్వల్పంగా రాణిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FPIs) నిరంతరాయంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ పతనానికి ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande