మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు యువకుల మృతి
హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.) వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దూసుకొచ్చిన కారు, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, అలాగే బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్
రోడ్డు ప్రమాదంరోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దూసుకొచ్చిన కారు, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, అలాగే బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కారు సుమారు 100 మీటర్ల వరకు వారిని ఈడ్చుకెళ్లి అనంతరం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందాడు. బైకుపై ఉన్న యువకులను మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్కు చెందిన ఈసీఈ రెండవ సంవత్సరం విద్యార్థులు శివ, సందీప్ జోహెల్గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారి తోటి విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. భారీగా పోలీసులు మోహరించడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande