
ముంబై, 08 ఏప్రిల్ (హి.స.)
దాదాపు రెండు నెలల పశ్చిమాసియా
యుద్ధ మేఘాలు వీడి, అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. ఈ వార్తలతో దేశీయ స్టాక్మార్కెట్లు నేడు (ఏప్రిల్ 8, 2026) సరికొత్త రికార్డులను సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం గ్లోబల్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 2,600 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 740 పాయింట్ల భారీ పెరుగుదలతో 23,800 మార్కును అధిగమించింది. ఈ అసాధారణ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగింది.
ఈ భారీ లాభాలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Brent Crude) ధరలు ఒకేరోజు సుమారు 15% (సుమారు $16) పడిపోయి, తిరిగి $95 దిగువకు చేరుకోవడమే. జలసంధిని హర్మూజ్ ఇరాన్ 300 తెరిచేందుకు అంగీకరించడంతో సరఫరా ఆటంకాలు తొలగుతాయన్న ఆశలు చిగురించాయి. దీనివల్ల పెయింట్స్, టైర్లు, ఆటోమొబైల్ మరియు ఏవియేషన్ రంగాల షేర్లు భారీగా లాభపడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..