అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి..
ఖమ్మం, 09 ఏప్రిల్ (హి.స.) నాణ్యతలో రాజీ పడొద్దు అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మండల కేంద్రం ముదిగొండలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రాథ
ఉపముఖ్యమంత్రి


ఖమ్మం, 09 ఏప్రిల్ (హి.స.)

నాణ్యతలో రాజీ పడొద్దు అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మండల కేంద్రం ముదిగొండలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భట్టి విక్రమార్క కృషితో 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనులను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ప్రతి పని నాణ్యతతో జరగాలని, అవినీతికి తావివ్వకుండా త్వరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆ దిశగా అధికారులందరూ ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. మండల నాయకులు ఉప ముఖ్యమంత్రికి శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, ఉసికల రమేష్, మల్లెల అజయ్ మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande