
జగిత్యాల, 09 ఏప్రిల్ (హి.స.)మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకోవడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. జీవన్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని చెప్పుకొచ్చారు. ఈరోజు(గురువారం) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నిశాంత్ కార్తికేయ బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి కమలం పార్టీలోకి ఎంపీ అరవింద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి మంట పెడతారని విమర్శించారు. ఓట్ల కోసం ఒక పార్టీ అభివృద్ధి పేరుతో మరో పార్టీ అని చెప్పుకుని తిరిగే వ్యక్తి సంజయ్ అని ఎద్దేవా చేశారు. మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చిన ఆశ్చర్యం లేదని విమర్శించారు. సంజయ్ ఫ్రస్టేషన్లో పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని.. ఆ పార్టీకి విధి విధానాలు కరువయ్యాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్