
హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)
ఆదాయపన్ను శాఖలో కీలక
పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తిని (Suresh Bathini) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న మోరంపూడి అనిల్ కుమార్ (Morampudi Anil Kumar) స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ కుమార్ కూడా తెలుగు అధికారి కావడం, ఆయన స్థానంలో మరోసారి మరొక తెలుగు అధికారికి ఈ అత్యున్నత పదవి దక్కడం విశేషం.
సురేశ్ బత్తిని గతంలో హైదరాబాద్ (Hyderabad) రీజియన్లోనే చీఫ్ కమిషనర్గా (CCIT) పనిచేసి మంచి గుర్తింపు పొందారు. రెండు రాష్ట్రాల్లోని పన్నుల పరిపాలన, ఆదాయ వసూళ్ల లక్ష్యాలు, శాఖాపరమైన అంశాలపై ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనేది అత్యున్నత పదవి. పన్ను వసూళ్ల లక్ష్యాలను పర్యవేక్షించడంతో పాటు చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, శాఖాపరమైన పరిపాలనను సమన్వయం చేయడం వంటివి ఆయన ప్రధాన బాధ్యతలు. త్వరలోనే సరేశ్ బత్తిని హైదరాబాద్లోని ఆదాయపన్ను కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు