
హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)
నార్సింగి సర్కిల్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు. గురువారం మొదటగా నార్సింగి లోని ఆర్కే గ్రాండ్ హోటల్ నుంచి పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెండు జేసీబీలతో తొలగించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నార్సింగి వైఎస్ఆర్ విగ్రహం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆక్రమణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నార్సింగి సర్కిల్ ఏసీపీ మనోహర్ ఆధ్వర్యంలో సుమారు 40 నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో పలువురు అడ్డుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితులకు ఎలాంటి సమయం, నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సబబు కాదని పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు