
హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)
వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే అదనపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, వంటి ప్రధాన స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, అనకాపల్లి, కాకినాడ తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 10 నుంచి 17 వరకు వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు ట్రిప్స్ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుపతి, కాకినాడ, నాందేడ్, ధర్మవరం, మైసూరు వంటి కీలక మార్గాల్లో ఈ సేవలు అందించనున్నారు. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఒత్తిడి లేని ప్రయాణాన్ని అందించడం లక్ష్యమని పేర్కొన్నారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలని సూచించారు. వేసవి రద్దీని తగ్గించడంతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపర్చడంలో ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు