మచిలీపట్నంలో మంత్రి కొల్లు ఆకస్మిక పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
మచిలీపట్నం లో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
minister-kolly-ravindra-sudden-visit-at-machilipatnam-urban-5392


మచిలీపట్నం, 09 ఏప్రిల్ (హి.స.)

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం.. మచిలీపట్నం గ్రామీణ మండలంలో పర్యటించారు. గ్రామాల్లో సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు ఆయన ప్రజల మధ్యలోకి వెళ్లారు. ఈ సందర్భంగా వాడపాలెంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అక్కడ ప్రజల నుంచి వినతులను స్వీకరించి.. వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించి, వాటిని వెంటనే ఆన్లైన్ చేయాలని సూచించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో ఏ ఒక్కరూ తాగునీటికోసం ఇబ్బంది పడకూడదని, గ్రామాలతో పాటు.. మచిలీపట్నం టౌన్ పరిధిలో ఉన్న అన్ని కాలనీల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇక వర్షాకాలం రాకముందే డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. వాడపాలెం వంటి లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండని సిబ్బందిపై వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande