మళ్లీ వచ్చిన IBOMMA.. కొత్త సినిమాలతో ఇంటర్నెట్లో ప్రత్యక్ష్యం
మళ్లీ వచ్చిన IBOMMA.. కొత్త సినిమాలతో ఇంటర్నెట్లో ప్రత్యక్ష్యం
Ibomma


హైదరాబాద్, 13 మే (హి.స.)

కొద్ది నెలల క్రితం వరకు తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా IBOMMA చర్చనీయాంశంగా మారింది. ఈ యాప్ నిర్వహకుడు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే యాప్ ను తొలగించారు. నాటి నుంచి ఇంటర్నెట్ లో IBOMMA వెబ్ సైట్ కనిపించకుండా పోయింది. అయితే బెయిల్ పై జైలు నుంచి రవి విడుదలైన కొద్ది రోజులకే.. మరోసారి ఇంటర్నెట్ IBOMMA వెబ్ సైట్ ప్రత్యక్షమైంది. Bappam పేరుతో ఉన్న లింకుపై క్లిక్ చేసిన వెంటనే నేరుగా ఐ బొమ్మ ఓపెన్ అవుతుంది. అందులో 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని కొత్త సినిమాలు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీంతో మరోసారి సినిమా నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. గతంలో చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజైన 24 గంటల్లోపే ఈ సైట్ లో పైరసీ, HD ప్రింట్ లతో సినిమాలు రావడం నిర్మాతలను కలవరపెట్టిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande