
హైదరాబాద్, 27 ఏప్రిల్ (హి.స.)
రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్జంటగా నటించిన చిత్రం డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం, భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. ఇప్పటికే కలెక్షన్ల విషయంలో రీ రిలీజ్ చిత్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ మూవీ, తాజాగా ఓ ఆల్ టైమ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. బుక్ మై షో ప్లాట్ఫామ్లో కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన 265K టికెట్లు అమ్ముడైనట్లు, ఇప్పటివరకు రీ రిలీజ్లో భాగంగా ఏ సినిమాకూ ఈ స్థాయిలో టికెట్లు ఈ ప్లాట్ఫామ్లో అమ్ముడుకాలేదని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి మంచి టికెట్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే, మరికొన్ని రోజులు పాటు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..