ఓటీటీలోకి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్సింగ్’.. స్ట్రీమింగ్ తేదీ రివీల్ చేసిన శ్రీలీల
ఓటీటీలోకి త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్
/ustaad-bhagat-singh-ott-release-date-confirmed-sreeleelas-post-go


అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

భారీ క్రేజ్తో విడుదలైనప్పటికీ, మొదటి షో నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అదే సమయంలో పోటీగా వచ్చిన ‘దురంధర్-2’ ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘ఉస్తాద్’ వసూళ్లపై దెబ్బ పడింది.

పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, డైలాగ్స్ ఉన్నప్పటికీ, కథలో పట్టు లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా ఆదరించలేదు. దీంతో ఈ మూవీ థియేటర్లలో త్వరగానే తన రన్ను ముగించుకుంది. థియేటర్లలో నిరాశపరిచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తున్నట్లు హీరోయిన్ శ్రీలీల అధికారికంగా వెల్లడించారు. థియేటర్లలో మిస్ అయిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande