'రామాయణ' రన్ టైం రివీల్ చేసిన రణబీర్ కపూర్..!
రణబీర్ కపూర్ రామాయణం ఏకంగా ఆరు గంటలు ఉండబోతోంది
Ramayana


హైదరాబాద్, 04 ఏప్రిల్ (హి.స.)

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా 'రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో రాముడిగా రబ్బీర్ కపూర్, సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై అందరి దృష్టి పడింది. ఇక ఇటీవల విడుదలైన రామ గ్లింప్స్ అంచనాలను మరింత పెంచాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్ కు సంబంధించి రణ్ బీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా సినిమాలు రెండున్నర లేదా మూడు గంటలు ఉంటాయి. కానీ, 'రామాయణ' సినిమా ఏకంగా 6 గంటల పాటు ఉండబోతోందని రణ్బీర్ వెల్లడించారు.

రామాయణం అనేది ఒక అద్భుతమైన కావ్యం కాబట్టి, అందులోని ఏ ఒక్క ముఖ్యమైన ఘట్టాన్ని కూడా వదలకుండా వెండితెరపై చూపించాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉందట. అందుకే విజువల్స్ అన్నీ కలిపి దాదాపు 6 గంటల ఎపిక్ అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఈ 6 గంటల సినిమా ఒకేసారి థియేటర్లలో చూపిస్తారా? లేక రెండు భాగాలుగా విడుదల చేస్తారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రబ్బీర్ కపూర్ డబుల్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande