ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి
ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి
ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి


చీరాల:, 17 మే (హి.స.)

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. చీరాల జయంతిపేటకు చెందిన హరీష్ రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యేందుకు బస్టాండ్ వద్దకు వచ్చారు. బస్టాండ్ సమీపంలో టీ తాగుతున్న హరీష్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. నడుము భాగంలో తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై చీరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande