
ఆకివీడు, 20 మే (హి.స.):
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆకివీడులోని దుంపగడప రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్న జవహర్ పేటలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బొమ్మి లక్ష్మీ అనే మహిళ ఇంట్లో పాలు కాస్తుండగా ఒక్కసారిగా వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, చేతుపై గాయాలయ్యాయి. స్పందించిన కుటుంబసభ్యులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పేలుడు దాటికి ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ