
నిమ్మాడ:17 మే (హి.స.)
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ) అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ