భగీరధ్ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం తప్పు చేసింది.. సీపీఐ నారాయణ
భగీరధ్ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం తప్పు చేసింది.. సీపీఐ నారాయణ
CPI


హైదరాబాద్, 17 మే (హి.స.)

బండి భగీరధ్ కేసుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భగీరధ్ ను చర్లపల్లి వద్ద అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని, మరోవైపు బండి సంజయ్ తానే తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని చెబుతున్నారన్నారు. బండి సంజయ్ చెబుతున్నదాన్ని బట్టి పోలీసు వ్యవస్థ ప్రశ్నార్థకమైందని విమర్శించారు. భగీరధ్ ముద్దాయి అయ్యాడని ఈ కేసులో కోర్టు అసమర్ధత కూడా కనిపించిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్ట్ చేసి ఉంటే ఈ గొడవ ఉండేదేకాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తప్పు చేసిందని అన్నారు.

ఎవరెవరినో ఎన్ కౌంటర్ చేశారని, భగీరధ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులకు చేతకాలేదా అని ప్రశ్నించారు. భగీరధ్ ను వెతకడానికి పది టీమ్ లను పంపించామని చెబుతున్నారని, పది టీమ్ లు గోర్లు తీసుకుంటున్నాయా అని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారంటే ఇది లాలూచీ పడటం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు మూడు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేసు అయిన వెంటనే బండి సంజయ్ తన కుమారుడిని అప్పగించి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, న్యాయవ్యవస్థ సైతం ముద్దాయిగా నిలిచిందన్నారు. దీనిపై వెంటనే తగిన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande