మండుతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే ఐదు రోజులు నిప్పులకుంపటే..
మండుతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే ఐదు రోజులు నిప్పులకుంపటే..
Summer


హైదరాబాద్, 17 మే (హి.స.)

తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి భగభగలు ఉండబోతున్నాయని ఎండల తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో 41 -44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు ఆదిలాబాద్, కొమురం బీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande