రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మతం పులుముతారా?.. రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మతం పులుముతారా?.. రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 17 మే (హి.స.)

SIR తో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మతం ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోందని సీఎం మాట్లాడారని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది తప్ప ప్రతి పోలింగ్ బూత్ కు నరేంద్ర మోడీ రాలేరన్నారు. బీఎల్వోలతో పాటు పార్టీలు నియమించిన బీఎల్ఎ లు ఉంటారన్నారని పార్టీలు నియమించిన బీఎల్ఎ లు ఉంటే కుట్ర ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. ఎస్ఐఆల్ో ఎలాంటి అవకతవకలు లేకున్నా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందన్నారు. ఎస్ఐర్ తో కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ కుట్ర ఏ గ్రామంలో జరిగే అవకాశం ఉందో చెప్పాలని సవాల్ విసిరారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ఓటర్ జాబితాను ప్రక్షాళన చేసేందుకే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి సర్కార్ తన బాధ్యతను అధికారులు, కేంద్రంపై నెట్టేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని రైతుల ధాన్యం కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యంకొనుగోలు చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande