అనంతపురంలో 100 పడకల అత్యాధునిక ఎల్.ఎం.ఆర్ ఆస్పత్రి ప్రారంభం
అనంతపురంలో 100 పడకల అత్యాధునిక ఎల్.ఎం.ఆర్ ఆస్పత్రి ప్రారంభం
minister-savitha-launches-lmr-hospital-and-nursing-home


అనంతపురం, 17 మే (హి.స.)

హెడ్క్వార్టర్స్లో 100 పడకలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక “ఎల్.ఎం.ఆర్ ఆస్పత్రి & నర్సింగ్ హోమ్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత ఈ ఆస్పత్రిని సరికొత్త టెక్నాలజీతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు ఇలాంటి ఆధునిక ఆస్పత్రులు మరింత అవసరమని పేర్కొన్నారు.

ఆస్పత్రిని ఏర్పాటు చేసిన వైద్య దంపతులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఆస్పత్రి మొత్తం పరిశీలించిన అనంతరం ఎక్కడా ఇరుకుగా లేకుండా విశాలంగా డిజైన్ చేయడం ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ వార్డ్ వంటి అత్యవసర విభాగాలను రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థంగా ఏర్పాటు చేశారని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యానికి ప్రభుత్వ తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రి మరింత మంచి సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించి గొప్ప పేరు తెచ్చుకోవాలని మంత్రి సవిత సంతోషాన్ని వ్యక్తపరిచారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande