పొగాకు సమస్యలపై పీయుష్ గోయల్, సీతారామన్ కు లేఖలు రాసిన చంద్రబాబు
పొగాకు సమస్యలపై పీయుష్ గోయల్, సీతారామన్ కు లేఖలు రాసిన చంద్రబాబు
పొగాకు సమస్యలపై పీయుష్ గోయల్, సీతారామన్ కు లేఖలు రాసిన చంద్రబాబు


అమరావతి, 18 మే (హి.స.)

రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు. రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానంవల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. ‘గతేడాది వేలంలో కిలో పొగాకు ప్రారంభ ధర రూ.280 ఉంటే ప్రస్తుత ఏడాది రూ.250కి పడిపోయింది. పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 43 వేల మంది రైతులతోపాటు, దీనిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడింది’ అని లేఖలో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande