తెలంగాణ.ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ.కోర్సుల్లో నిర్వహించే ఎప్ సెట్.లో. ఏపి విద్యార్ధులు సత్తా
తెలంగాణ.ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ.కోర్సుల్లో నిర్వహించే ఎప్ సెట్.లో. ఏపి విద్యార్ధులు సత్తా
తెలంగాణ.ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ.కోర్సుల్లో నిర్వహించే ఎప్ సెట్.లో. ఏపి విద్యార్ధులు సత్తా

అమరావతి, 18 మే (హి.స.)

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్-2026 ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో 3, 4.. అగ్రికల్చర్లో 6, 7, 9 ర్యాంకులను ఏపీ అభ్యర్థులు సాధించారు. కాగా, టా పర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా, మొత్తం ఫలితాల్లో అమ్మాయి లు పైచేయి సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో 8.. అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి 10 ర్యాంకుల్లో 7 అబ్బాయిలకే దక్కాయి. మొత్తంగా చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో అమ్మాయిలు 73.72 శాతం అర్హత సాధించగా, అబ్బాయిలు 73.10 శాతం అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అమ్మాయిలు 86.76 శాతం, అబ్బాయిలు 84.70 శాతం అర్హత సాధించారు. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 73.36 శాతం, అగ్రికల్చర్లో 86.27 శాతం అర్హత సాధించారు. ఎప్సెట్ ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కంచర్ల కేశవరావు విడుదల చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 84,954 మంది హాజరయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande