
అమరావతి, 18 మే (హి.స.)
గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలని ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిఅధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ఫీల్డ్ పోర్టులు, పిషింగ్ హార్బర్ల పురోగతిపై మంత్రి ఈరోజు (సోమవ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గ్రీన్ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ