కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం- ఖర్గే, రాహుల్, రేవంత్ హాజరు
కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం- ఖర్గే, రాహుల్, రేవంత్ హాజరు
sathish


తిరువనంతపురం, 18 మే (హి.స.)

: కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళ 13వ సీఎంగా వీడీ సతీశన్ సోమవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. అయితే సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande