వారి త్యాగాల వల్లే మార్చి 31 కంటే ముందే నక్సలిజాన్ని నిర్మూలించాం : అమిత్ షా
వారి త్యాగాల వల్లే మార్చి 31 కంటే ముందే నక్సలిజాన్ని నిర్మూలించాం : అమిత్ షా
Amithsha


న్యూఢిల్లీ, 20 మే (హి.స.)

భద్రతా బలగాల ధైర్యసాహసాలు, త్యాగాల వల్లే నిర్దేశిత గడువు 2026 మార్చి 31 కంటే ముందే దేశం నుంచి నక్సలిజాన్ని అంతం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన 26వ సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బస్తర్ నక్సల్స్ రహిత ప్రాంతంగా మారడం అందరికీ గర్వకారణమని అన్నారు. కేంద్రం చేపట్టిన నక్సల్స్ రహిత పోరాటానికి చాలా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. కానీ, ఛత్తీస్గఢ్లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు కనీస సహకారం అందించలేదని ఆరోపించారు. 2023 డిసెంబరు 13న ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ ఏర్పడిన వెంటనే బస్తర్లో మిగిలిన నక్సలైట్లను ఏరివేశామని అమిత్ షా తెలిపారు. బస్తర్ ప్రజలు ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారన్న ఆయన, ఈ ప్రాంత అభివృద్ధికి చేపట్టిన 'వీర్ గుండాధర్ సేవా డేరా' కార్యక్రమాన్ని కొనియాడారు.

నక్సల్ బరి నుంచి నక్సలిజం విస్తరించడం మొదలైనప్పటి నుంచి దానికి మద్దతిచ్చే మేధావులు ఒక వాదన వినిపిస్తూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగనందు వల్లే నక్సలిజం ఉద్భవించిందని చెబుతున్నారు. కానీ అది నిజం కాదు. వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి జరగకపోవడానికి అసలు కారణం నక్సలిజమే అని స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల కంటే కూడా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ అక్కడ నక్సలిజం పుట్టలేదు. ఆ ప్రాంతాలు క్రమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయి. మన బస్తర్, ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande