
పెద్దపల్లి, 18 మే (హి.స.)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు అధిక
నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ నుండి పెగడపల్లి మండలం కీచులాటపల్లి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి సోమవారం మంత్రి పరిశీలించారు. అదే విధంగా మండల కేంద్రం నుంచి ఏడుమోటాల పల్లి తండా వరకు రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలోని తండాలన్నింటికి ప్రధాన రోడ్లకు కలుపుతూ లింక్ రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని అందుకు గాను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తండాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా మండల కేంద్రం నుంచి ఏడుమోటాల పల్లి తండా వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను వేగవంతం చేయాలని రోడ్డు నిర్మాణం కోసం రైతులు సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..