స్వీడన్ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు- ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందన్న ప్రధాని
స్వీడన్ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు- ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందన్న ప్రధాని
pm modi addresing public meetinf at somnath


న్యూఢిల్లీ, 18 మే (హి.స.)

: స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదంపై భారత్ పోరాటాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్కు మద్దతు తెలిపిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికే తీవ్రమైన సవాల్ అని పేర్కొన్న మోదీ, టెర్రరిజం, దానికి మద్దతిచ్చే శక్తులపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

గోతెన్బర్గ్లో నిర్వహించిన యూరోపియన్ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్, స్వీడన్లాంటి ప్రజాస్వామ్య దేశాల మధ్య సన్నిహిత సహకారం ఎంతో ముఖ్యమని చెప్పారు. పహల్గామ్లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ పౌరుడు ఉన్నారని తెలిపారు. ఆ దాడికి ప్రతిగా భారత్ మే 6-7 తేదీల మధ్య ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుందని గుర్తు చేశారు.

డిఫెన్స్ రంగంలో భారత్-స్వీడన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. కేవలం కొనుగోలు-అమ్మకాల సంబంధం కాకుండా దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా ఈ అనుబంధం మారుతోందన్నారు. స్వీడిష్ కంపెనీలు భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. గత 12 ఏళ్లుగా భారత్ సంస్కరణలు, పనితీరు, మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ రాజకీయ సంకల్పంతో రీఫార్మ్ ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకెళ్తోంది అని మోదీ అన్నారు. యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు భారత్ను ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు.

డిజైన్ ఫర్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ ఫ్రం ఇండియా అనే దృష్టితో భారత్ ముందుకు సాగుతోందన్నారు. తదుపరి టెక్నాలజీ విప్లవాన్ని భారత్లోనే సంయుక్తంగా సృష్టించాలని యూరోపియన్ కంపెనీలను కోరారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ మొబిలిటీ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. భారత్ యువత ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ప్రధాన బలం అవుతుందని మోదీ అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, టాలెంట్ మొబిలిటీ రంగాల్లో భారత్-యూరప్ భాగస్వామ్యం మరింత పెరగాలని కోరారు. ఇండియా-యూరప్ సీఈఓ రౌండ్టేబుల్ను ప్రతి ఏడాది నిర్వహించాలని, యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో “ఇండియా డెస్క్” ఏర్పాటు చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande