జాతర సందర్బంగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు.. ములుగు జిల్లా కలెక్టర్
ములుగు, 18 మే (హి.స.) ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలను సోమవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్ట
Collector


ములుగు, 18 మే (హి.స.) ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలను సోమవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్ట మొదటి సారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్న కలెక్టర్ కు ఆదివాసి గిరిజనులు తమ సాంప్రదాయ ప్రకారంగా డోలు వాయిద్యాల మధ్య గద్దెల ప్రాంతానికి తీసుకువెళ్లారు. గిరిజన పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత జాతర సందర్బంగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని, నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande