
హైదరాబాద్, 18 మే (హి.స.)
తెలంగాణలో భానుడు భగభగ మంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 41 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు రాబోయే నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మే 19 నుంచి 24 వరకు ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
తీవ్రమైన వడగాల్పుల దృష్ట్యా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, కాబట్టి ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ గట్టిగా విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..