విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం.. వనపర్తి జిల్లా కలెక్టర్
వనపర్తి, 18 మే (హి.స.) విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంతో ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్.డీ.ఎం.ఏ) ఆదేశాలమేరకు రాష్ట్ర విపత్తు స్పందన (ఎస్.డీ.ఆర్.ఎఫ్) సూచన
Collector


వనపర్తి, 18 మే (హి.స.)

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంతో ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్.డీ.ఎం.ఏ) ఆదేశాలమేరకు రాష్ట్ర విపత్తు స్పందన (ఎస్.డీ.ఆర్.ఎఫ్) సూచనలతో వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు నీటిలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మాల్డ్రిల్ నిర్వహించారు. భారీ వరదలు సంభవించిన సందర్భంలో ప్రజలను ఎలా రక్షించాలి, అత్యవసర పరిస్థితుల్లో స్పందనా బృందాలు ఎలా పనిచేయాలనే అంశాలపై ఈ మాబ్డిల్ చేపట్టారు. మాల్లో భాగంగా వరదల కారణంగా నల్ల చెరువులో ముంపునకు గురై చిక్కుకున్న ప్రజలను ఎస్ఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సురక్షితంగా రక్షించే చర్యలను ప్రదర్శించారు. స్పందనా బృందాలు సమన్వయంతో పనిచేస్తూ బోటు, లైఫ్ జాకెట్ల సాయంతో ప్రజలను రక్షించి, ప్రథమ చికిత్స అందజేసి అంబులెన్సులో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి పరిశీలించి, సహాయక చర్యల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు సంభవించిన అత్యవసర పరిస్థితులలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడాలని అంశంపై మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ శాఖలు సంసిద్ధత కోసం ఈ మాక్ డ్రిల్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. వరదలు వచ్చి అత్యవసర పరిస్థితులు ఏర్పడే ఏడు ప్రదేశాలను జిల్లాలో గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు.

10 సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదు అయితే నల్ల చెరువు ప్రాంతంలో వరద నీటితో అత్యవసర పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో ఇక్కడ మోక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్యశాఖ, నీటిపారుదల శాఖ, ఇతర ముఖ్యమైన శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలను సంసిద్ధతను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, డిఎస్పి గిరి ప్రసాద్, ఇతర జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande