టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన
టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన
CM N. Chandrababu Naidu marks one year of TDP-led NDA victory in Andhra Pradesh


తిరుమల, 18 మే (హి.స.)

తిరుమల కొండల్లో పచ్చదనాన్ని గణనీయంగా పెంచినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తిరుమల గిరుల వ్యాప్తంగా 89.40 శాతం అటవీ విస్తీర్ణాన్ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీకి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. శేషాచలం కొండల్లో అటవీ సంపదను కాపాడటం, స్థానిక జాతుల మొక్కలను పునరుద్ధరించడం కోసం టీటీడీ చేపట్టిన సుస్థిర పరిరక్షణ చర్యలు అభినందనీయమన్నారు. ఈ కృషి ఫలితంగానే పచ్చదనం గణనీయంగా పెరిగిందని కొనియాడారు.

మన సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రంగా భావిస్తాయి. అడవులు, వన్యప్రాణులను రక్షించడం దైవ సేవతో సమానం. భావి తరాలకు మరింత పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమలను అందించడానికి ఈ ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయి అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. టీటీడీ కృషి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణకు టీటీడీ యాజమాన్యం చూపుతున్న చొరవను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande