ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు
ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు
Chandra Babu Naidu


అమరావతి, 18 మే (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ నాయకులకు స్వీడన్ అందించే అత్యున్నత పురస్కారం 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్' ఆయనకు లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ అద్భుతమైన నాయకత్వ పటిమకు ఈ పురస్కారం ఒక నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. అంతర్జాతీయంగా భారత భాగస్వామ్యాలను, ప్రపంచ దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి మోదీ నిరంతరం చేస్తున్న కృషిని ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.

విశేషమేమిటంటే, ఇది ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం అని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని పెంచడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande