
హిందూపురం, 18 మే (హి.స.)
పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్న ఓ లారీని మనేసముద్రం గ్రామ పరిసర ప్రాంతంలో వద్ద అధికారులు ఈ రోజు తెల్లవారుజామున పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పౌర సరఫరాల (PDS) బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ C. ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడి నిర్వహించి 16 టన్నుల పిడిఎస్ పట్టుకోవడం జరిగిందని హిందూపురం రూరల్ ఆఫ్ గ్రేడ్ హిందూపురం మండలం మనేసముద్రం గ్రామ పరిసర ప్రాంతంలో కాపు కాసి తనిఖీలు చేపట్టగా, ఐచర్ వాహనం నంబర్ AP-39-TN-3414 లో తరలిస్తున్న భారీ మొత్తంలో PDS బియ్యాన్ని గుర్తించారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి గారు మరియు VROల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV