యూరియా తగ్గించి జీవన ఎరువులు వాడాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు
యూరియా తగ్గించి జీవన ఎరువులు వాడాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు
Scientist


కరీంనగర్, 19 మే (హి.స.)

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణవ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతుల పై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని మంగళవారం సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని తీసుకువెళుతున్నారు. నేరుగా క్షేత్రస్థాయిలోకి

వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్. ఇ. రజనీకాంత్ మాట్లాడుతూ తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చుని తగ్గించండి, పంట వ్యర్థాలు కలియ దున్నడం ద్వారా నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడం, నీటి ఆదా చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కలిగించారు. శాస్త్రవేత్త డా. ఇ.ఉమారాణి మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు సాగు, సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి, అవసరం మేరకే రసాయన ఎరువుల వాడకం అనే విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాల్లో జరిగే ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. నానో ఎరువుల వాడకం వలన జరిగే ప్రయోజనాలను మండల వ్యవసాయ అధికారి వైదేహి రైతులకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande