మతపరమైన ఉద్రిక్తతలపై వార్తలు.. హైదరాబాద్ పోలీసుల లీగల్ నోటీసులు
హైదరాబాద్, 19 మే (హి.స.) దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మెహదీపట్నం, గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతపరమైన విద్వేషాలను రగిల్చేలా, శాంతిభద
Police


హైదరాబాద్, 19 మే (హి.స.)

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని మెహదీపట్నం,

గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతపరమైన విద్వేషాలను రగిల్చేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై సిటీ పోలీస్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియా, మీడియా, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న 17 ప్రముఖ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ శాఖకు చెందిన ఐటీ సెల్ 'ఎక్స్ కార్పొరేషన్' లీగల్ విభాగానికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. సమాచార సాంకేతిక సవరణ చట్టం-2008 (IT Act) లోని69(A), 79(3) సెక్షన్ తో పాటు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 94, 179 కింద ఈ లీగల్ నోటీసును పంపారు.

ఈ నోటీసులో పోలీసులు మొత్తం 17 అకౌంట్లు, లింకులను పొందుపరిచారు. వీటిలో ఎఐఎంఐఎం (AIMIM) అధికారిక హ్యాండిల్, ది సియాసత్ డైలీ, న్యూస్ మీటర్ వంటి మీడియా సంస్థల ఖాతాలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు (మొహమ్మద్ నసీరుద్దీన్ - ఎంఐఎం కార్పొరేటర్), బీఆర్ఎస్ భారత్, హిందుత్వ డాన్, అష్రఫ్ హుస్సేన్ వంటి పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్లు ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా షేర్ అవుతున్న వివాదాస్పద హ్యాష్యాగ్లు, కంటెంట్ ప్రజల్లో అశాంతిని పెంచేలా ఉన్నాయని.. ప్రజా భద్రత దృష్ట్యా ఈ పోస్టులను వెంటనే సమీక్షించి, ప్లాట్ఫారమ్ విధానాల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని పోలీసులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande