బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత : మంత్రి గడ్డం వివేక్
హైదరాబాద్, 19 మే (హి.స.) విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్
Minister


హైదరాబాద్, 19 మే (హి.స.)

విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గది భవన నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక కారణాలతో చదువుకు దూరమవుతున్న బాలికలకు ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తూ కేజీబీవీలు విద్యావకాశాలను చేరువ చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్య దిశగా ముందుకు సాగే అవకాశాన్ని కల్పిస్తున్నాయని కార్మిక సమస్యలను తగ్గించడంలో కూడా కేజీబీవీలు కీలకంగా పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల పది మారాయని, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల చదువుకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని మంత్రి తెలిపారు. గత సంవత్సరాలుగా ఉస్మాన్ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయ విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభకనబరుస్తూ విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande