
చిత్తూరు, 19 మే (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు బుధవా రం బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు మంగళవారం కావలి మండ లం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లెకు వెళ్తారు. అక్కడే రాత్రి బస చేసి ఉదయం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి రేపు బెంగళూరులో పర్యటించనున్నారు. కనకపుర రోడ్డులోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' అంతర్జాతీయ కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు. అక్కడ నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసులు మరియు ట్రాఫిక్ విభాగం అప్రమత్తమయ్యారు. సీఎం రాకను పురస్కరించుకుని కనకపుర రోడ్డు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి రేపు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV