వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల


తిరుమల, 19 మే (హి.స.)

వేసవి సెలవుల సీజన్ ప్రారంభం కావడంతో కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం భక్తుల జనసందోహంతో పూర్తిగా పోటెత్తింది. ఈ స్థాయిలో భక్తుల రాకను ముందే ఊహించిన తిరుమల అధికారులు, భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు రద్దీని అంచనా వేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, వెలుపల ఉన్న క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న అశేష భక్తజనానికి నిరంతరాయంగా చల్లని తాగునీరు, పాలు, మజ్జిగ మరియు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల పరిసరాల్లో ప్రత్యేక వైద్య బృందాలను నిలిపి సత్వర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

. అలాగే సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దాదాపు 10,814 వాహనాలు అలిపిరి దాటుకుని తిరుమల కొండకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక తిరుపతి నగరంలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ల వద్ద రోజువారీగా ఇచ్చే ఉచిత సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే భారీగా వేచి ఉన్నారు. ఫలితంగా, తెల్లవారుజామున టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైన కేవలం గంట లోపే ఆ రోజుకు సంబంధించిన సర్వదర్శన టోకెన్ల కోటా పూర్తిగా ముగిసిపోయింది. టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు నేరుగా కొండపైకి చేరుకుని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శన భాగ్యం కోసం ఓపికగా వేచి చూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande