
మహబూబాబాద్, 19 మే (హి.స.) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసి బ్యాంకు శాఖను స్థానిక శాసనసభ్యులు డాభూక్యా మురళి నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెల్లికుదురు మండల ప్రజలకు ముఖ్యంగా నిరుపేద రైతులకు సామాన్య ప్రజానీకానికి బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా పారదర్శకంగా అందించేందుకు ఈ ఎంతగానో ఉపయోగపడుతుందని నూతన శాఖ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకార రంగం బలోపేతానికి రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ డిసిసి బ్యాంకు తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు, బంగారు రుణాలు అందిస్తుందని అంతేకాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని దీనితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను కూడా డీసీసీబీ బ్యాంక్ సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయం అని అంతేకాకుండా నెల్లికుదురు మండల ప్రజలకు, రైతులకు వ్యాపారస్థులు ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా వృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యంగా బ్యాంకు అధికారులు కూడా ఖాతా దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నేహ పూర్వకంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు