
20 మే (హి.స.)
విశాఖపట్నం
విశాఖ సింహాచంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత బంటుపల్లి ఇందుమతి (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలి భర్త బంటుపల్లి మహేశ్తో గత రాత్రి గొడవ జరగడంతో ఇందుమతి గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్య ఎంతకీ కనపడకపోవడంతో భర్త గదిలో వెళ్లి చూడగా.. ఇందుమతి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇందుమతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై హాస్పటల్ వైద్యులు గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ