తిరుపతి.జిల్లా.రైల్వే కోడూరు.మండలం బాలపల్లె చెక్ పోస్ట్ వద్ద రెండు.కార్లు దగ్దం
తిరుపతి.జిల్లా.రైల్వే కోడూరు.మండలం బాలపల్లె చెక్ పోస్ట్ వద్ద రెండు.కార్లు దగ్దం
తిరుపతి.జిల్లా.రైల్వే కోడూరు.మండలం బాలపల్లె చెక్ పోస్ట్ వద్ద రెండు.కార్లు దగ్దం

తిరుపతి, 20 మే (హి.స.)

చెక్పోస్టు వద్ద ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో కడప నుంచి తిరుపతి వెళ్తున్న మరో కారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆగింది. ఆగిన కారులోంచి అనుహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ప్రమాదానికి గురైన కారుకు అంటుకున్నాయి. దాంతో రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. బైక్ తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోని బాలపల్లె చెక్పోస్టు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన కారులో ఉన్న డ్రైవర్ అందులో నుంచి దూకేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ వెనకభాగం పాక్షికంగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande