
న్యూఢిల్లీ, 20 మే (హి.స.)
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఢిప్యూటీ
సీఎం భట్టి విక్రమార్క ఇవాళ నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, మూల ధన వ్యయాలకు సంబంధించిన అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. సాస్కి పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5000 కోట్ల ఆర్థిక సాయం అందించాలని భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు భట్టి విక్రమార్క వివరించారు. డీఈఏ ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార ప్రాజెక్టులకు ఎఫ్తాబీ౯ఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..