
గోదావరిఖని, 20 మే (హి.స.) దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు
కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్లను పంపించేసి ఆయన మాట్లాడారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వారి స్వావలంబనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 20 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు