నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్
నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్
నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్


హైదరాబాద్, 20 మే (హి.స.)

నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసని, పోక్సో కేసులో తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. కన్న కొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలనే తాను కుమారుడిని అప్పగించినట్లు చెప్పారు.

హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలే అన్నారు. కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కార్యకర్తను 'మీ చివరి కోరిక ఏమిటి' అని అడిగితే చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటామని అన్నారు.

తనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ స్పందిస్తూ, కేసీఆర్ పార్టీకి లోక్ సభలో ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. వారు ఫామ్ హౌస్లో కూర్చుని ఏదైనా చెబుతారని అన్నారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ పాలనను అంతం చేసింది తామేనని అన్నారు. అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande