మెడికల్ షాప్స్ క్లోజ్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!
మెడికల్ షాప్స్ క్లోజ్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!
medical-shops-bandh-complete-shutdown-chemists-rally-from-clock-towe


అనంతపురం, 20 మే (హి.స.)

అనంతపురం నగరంలో మెడికల్ షాపులు పూర్తిగా బంద్ అయ్యాయి. ఆన్లైన్లో మెడికల్ షాపులకు, మందుల అమ్మకాలకు లైసెన్స్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ... అఖిల భారత కెమిస్ట్ల సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అనంతపురం నగరంలోని మెడికల్ షాపుల యాజమానులు, సిబ్బంది తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నగరంలోని క్లాక్ టవర్ నుంచి శ్రీకంఠం సర్కిల్ వరకు మెడికల్ షాప్ యాజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఆన్లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలు జరపడం వల్ల నాణ్యత లేని మందులు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని, అలాగే స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మెడికల్ షాప్ యాజమానుల హెచ్చరిక ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande