
జమ్ముకశ్మీర్, 21 మే (హి.స.):జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో 2025 ఏప్రిల్లో జరిగిన ఘోర ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ కేంద్రంగా నడిచిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) హ్యాండ్లర్లు పాకిస్థాన్ నుంచి ఈ దాడిని నడిపినట్లు ఎన్ఐఏ పేర్కొంది. అలాగే ఫాల్స్ ఫ్లాగ్ ప్రచారాన్ని కూడా పాక్ నుంచే నడిపినట్లు ఎన్ఐఏ వెల్లడించింది
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హ్యాండ్లర్లు పాక్ నుంచి ఈ ఉగ్రదాడికి వ్యూహ రచన చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడి జరిగిన వెంటనే కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత స్వీకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడం, ఐరాస భద్రతామండలి దాడిని ఖండించడంతో టీఆర్ఎఫ్ వెనక్కి తగ్గి తమ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పినట్లు వెల్లడించింది. ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో 'కశ్మీర్ ఫైట్' ఛానల్ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలోని బట్టాగ్రామ్ ప్రాంతం నుంచి నడిచినట్లు తేలింది. 'ది రెసిస్టెంట్ ఫ్రంట్- అఫీషియల్' అనే మరో ఛానల్ రావల్పిండి నుంచి నిర్వహించినట్లు గుర్తించింది. దాడిని భారత్ చేసిందన్న తప్పుడు ప్రచారాన్ని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పాక్ ప్రణాళికాబద్ధంగా నడిపిందని ఎన్ఐఏ పేర్కొంది.
ఇక ఆపరేషన్ మహాదేవ్లో హతమన ఉగ్రవాదులు వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లపై విచారణ జరిపినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఆ ఫోన్లు పాకిస్థాన్లో కొనుగోలు చేసినవేనని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. ఒక ఫోన్ లాహోర్లోని క్వైద్-ఎ-ఆజమ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చిరునామాకు ఆన్లైన్లో, మరో ఫోన్ కరాచీలోని షహ్రా
ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ అలియాస్ లంగ్డా ఈ కుట్ర వెనక ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్లోని లాహోర్లో ఉండి అతడు పహల్గామ్లోని ఉగ్రవాదులకు నేరుగా ఆదేశాలు ఇచ్చాడని వెల్లడించింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఫైజల్ జాట్ ఎలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ ఎలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులను సాజిద్ జట్ బైసరన్ లోయ ప్రాంతానికి పంపినట్లు ఛార్జ్షీట్ పేర్కొంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలపై వారు నిఘా పెట్టినట్లు తెలిపింది. దాడి జరిగిన రోజున కూడా సాజిద్ లాహోర్ నుంచే ఉగ్రవాదులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించినట్లు ఎన్ఐఏ తెలిపింది. వారికి రియల్ టైమ్ కోఆర్డినేట్లు, ప్రదేశాల సమాచారం, తప్పించుకునే మార్గాలపై సూచనలు ఇచ్చినట్లు పేర్కొంది. స్థానికంగా పర్వేజ్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాదులకు సహకరించినట్లు వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi