ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి
ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి
suicide


ఢిల్లీ, 03 మే (హి.స.)

ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్కు చెందిన 30 ఏళ్ల యువ న్యాయాధికారి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

అమన్ బావమరిది శివమ్, పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్రూం తలుపులు పగలగొట్టి చూడగా, అమన్ కుమార్ శర్మ ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కుటుంబ కలహాల కారణంగానే అమన్ తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన తండ్రి, ఇతర బంధువులు పోలీసుల వద్ద ఆరోపించినట్లు సమాచారం. అయితే, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande