విజయవంతంగా శ్రేణి క్షిపణి ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ క్షిపణి పరీక్ష
విజయవంతంగా శ్రేణి క్షిపణి ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ క్షిపణి పరీక్ష
క్షిపణి


, 03 మే (హి.స.)

న్యూఢిల్లీ,

శత్రు నౌకలపై దాడి చేసేందుకు ఉద్దేశించిన ఒక కొత్త స్వల్ప శ్రేణి క్షిపణి ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ని భారత నౌకాదళం, డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీర ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి రెండు క్షిపణులను వెంట వెంటనే ప్రయోగించి పరీక్షించారు. ఉన్నతీకరించిన ఈ క్షిపణిలో ఏర్పాటు చేసిన స్మార్టర్ కంట్రోల్స్ శత్రు నౌకలను గురి తప్పకుండా కొట్టి తీవ్ర నష్టం కలిగించ గలవు. ఈ ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ క్షిపణులు పాతవాటి కన్నా తేలికగా ఉంటాయి. దీంతో హెలికాప్టర్ల ద్వారా వీటిని సులభంగా తీసుకుని వెళ్లవచ్చు, వాటి నుంచే ప్రయోగించవచ్చు. దీని పరిధి 55 కి.మీ అంత ఎక్కువ కాకపోయినప్పటికీ, ఇది అధునాతన లక్ష్య నిర్ధారణ సాంకేతికతను, ఒక పటిష్టమైన చోదక బూస్టర్ను కలిగి ఉన్నది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం దీనిని సులభంగా ప్రయోగించ వచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande