
కలకత్తా, 03 మే (హి.స.)
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), అస్సాం (Assam) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.మధ్యాహ్నం ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది.
పశ్చిమ బెంగాల్ లో కౌంటింగ్ అంతా సిద్ధం...11 జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం
మరోవైపు, బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది.ఆయా జిల్లాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్భూం, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ తదితర జిల్లాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi